Advertisement

హొమ్ /సినిమా వార్తలు / రామ్ చరణ్ ‘RC 12’ ఫస్ట్ లుక్,టీజర్ విడుదల తేది ప్రకటించిన చిత్ర యూనిట్...!

రామ్ చరణ్ ‘RC 12’ ఫస్ట్ లుక్,టీజర్ విడుదల తేది ప్రకటించిన చిత్ర యూనిట్...!

బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన 12 వ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాకి ఇంకా పేరు ఖరారు చేయలేదు.ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా అభిమానులకి ఈ రోజు చిత్ర యూనిట్ మంచి న్యూస్ తెలిపింది. రామ్ చరణ్ నటిస్తున్న 12వ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ అలాగే టీజర్ విడుదల తేదీలను చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్ కొద్దీ సేపటి క్రితం అధికారికంగా ప్రకటించింది. మొదటగా దీపావళి కానుకగా నవంబర్ 6న మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు. ఆతరువాత నవంబర్ 9న ఉదయం 10 : 25గంటలకు ఈ చిత్రం యొక్క టీజర్ ను విడుదల చేయనున్నారు. ఇలా మూడు రోజుల వ్యవధిలో అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వనున్నాడు రామ్ చరణ్.ఇక ఈ చిత్రానికి ‘వినయ విధేయరామ’ అనే టైటిల్ దాదాపుగా ఖరారు చేశారని సమాచారం.ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన్ కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రాన్ని దానయ్య డీవీవీ నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.

ప్రచురించబడింది: 05-11-2018 16:08:50

మరిన్నీ సినిమా వార్తలు

దీక్షితా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ కొత్త చిత్ర ప్రారంభం...!
దీక్షితా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ కొత్త చిత్ర ప్రారంభం...!
ఘనంగా ప్రసాద్ లాబ్స్ లో 'పార్టీ' మూవీ ఆడియో లాంచ్‌
ఘనంగా ప్రసాద్ లాబ్స్ లో 'పార్టీ' మూవీ ఆడియో లాంచ్‌
కర్ణుడిగా పాత్రలో బాబాయ్...అర్జునిడి పాత్రలో నందమూరి అబ్బాయి...!
కర్ణుడిగా పాత్రలో బాబాయ్...అర్జునిడి పాత్రలో నందమూరి అబ్బాయి...!
అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్న మెగాస్టార్ చిరంజీవి...!
అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్న మెగాస్టార్ చిరంజీవి...!
సెన్సార్ కార్యక్రమాలు  పూర్తిచేసుకున్న రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’...!
సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’...!
విడుదలకు సిద్ధమవుతోన్న 'ఉన్మాది'
విడుదలకు సిద్ధమవుతోన్న 'ఉన్మాది'
ప్రెస్ నోట్స్

సినిమా వార్తలు
రాజకీయ వార్తలు