Advertisement


హొమ్ /సినిమా వార్తలు / నవంబర్ 13 న వి ఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న సినిమా టైటిల్ లోగో విడుదల...!

నవంబర్ 13 న వి ఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న సినిమా టైటిల్ లోగో విడుదల...!

మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు ప్రొడ‌క్ష‌న్ నెం 3 ని మొద‌లుపెట్ట‌బోతున్నారు. రామ్ తాళ్ళూరి ఈ చిత్రాన్ని భారీగా నిర్మించనున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా అనగానే ట్రేడ్ వర్గాల్లో అప్పుడే ఆసక్తి మొదలైంది. న‌వంబ‌ర్ 13న ఈ చిత్రం పేరుని అధికారికంగా ప్ర‌క‌టించ‌డంతో పాటు టైటిల్ లోగోని లాంచ్ చేయనున్నారు. రవితేజ త‌న‌ కెరీర్ లో తొలిసారిగా సైంటిఫిక్ కథాంశంతో తెరకెక్కే చిత్రంలో నటించబోతున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత రామ్ తళ్ళూరి మాట్లాడుతూ... ముందుగా తెలుగు ప్రేక్షకులందరు ఈ దీపావళిని ఆనందోత్సాహాలతో ప్రత్యేకంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. మాస్ మహారాజా రవితేజ గారితో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు వి ఐ ఆనంద్ చెప్పిన కథ అద్భుతంగా ఉండడంతో ఓకే చేసి ప్రాజెక్ట్ ని ప్రారంభించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం. రవితేజ గారు ఇప్పటివరకు ట‌చ్ చేయని జాన‌ర్ లో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. ఓ సైంటిఫిక్ కథలో మొద‌టిసారిగా ర‌వితేజ‌ నటించనున్నారు. మా బ్యానర్ వాల్యు ని మ‌రింత‌ పెంచే విధంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాం. ఈ చిత్రానికి కొన్ని క్రేజీ టైటిల్స్ అనుకుంటున్నాం. అన్ని వర్గాల్ని ఎంటర్టైన్ చేసే విధంగా ఈ సినిమా ఉండనుంది. నవంబ‌ర్13న సినిమా టైటిల్ ని అధికారికంగా ప్ర‌క‌టించ‌డంతో పాటు‌ లోగోని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం అని అన్నారు.

ప్రచురించబడింది: 08-11-2018 10:16:18


మరిన్నీ సినిమా వార్తలు

దీక్షితా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ కొత్త చిత్ర ప్రారంభం...!
దీక్షితా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ కొత్త చిత్ర ప్రారంభం...!
ఘనంగా ప్రసాద్ లాబ్స్ లో 'పార్టీ' మూవీ ఆడియో లాంచ్‌
ఘనంగా ప్రసాద్ లాబ్స్ లో 'పార్టీ' మూవీ ఆడియో లాంచ్‌
కర్ణుడిగా పాత్రలో బాబాయ్...అర్జునిడి పాత్రలో నందమూరి అబ్బాయి...!
కర్ణుడిగా పాత్రలో బాబాయ్...అర్జునిడి పాత్రలో నందమూరి అబ్బాయి...!
అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్న మెగాస్టార్ చిరంజీవి...!
అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్న మెగాస్టార్ చిరంజీవి...!
సెన్సార్ కార్యక్రమాలు  పూర్తిచేసుకున్న రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’...!
సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’...!
విడుదలకు సిద్ధమవుతోన్న 'ఉన్మాది'
విడుదలకు సిద్ధమవుతోన్న 'ఉన్మాది'
ప్రెస్ నోట్స్


సినిమా వార్తలు
రాజకీయ వార్తలు