Advertisement


హొమ్ /సినిమా వార్తలు / మురుగదాస్‌ ను అరెస్ట్ చేసేందుకు ఇంటి వద్దకు వెళ్ళిన తమిళనాడు పోలీసులు...!

మురుగదాస్‌ ను అరెస్ట్ చేసేందుకు ఇంటి వద్దకు వెళ్ళిన తమిళనాడు పోలీసులు...!

స్టార్ డైరెక్టర్ మురుగదాస్‌ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన సినిమా ‘సర్కార్. దీపావళి కానుకగా ఈ చిత్రం విడుదలయి భారీ కలెక్షన్లను కొల్లగొడుతుంది. అయితే ఈ సినిమాలో జయలలిత పథకాలను అవమానపరిచే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని కొంతమంది పోలీసులకు పిర్యాదు చేసారు.. ఈ సన్నివేశాలను చిత్రీకరించినందుకు గాను డైరెక్టర్ మురుగదాస్ ను అరెస్ట్ చేయాలనీ పిర్యాదు చేయడంతో నిన్న రాత్రి చెన్నై పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు.ఆ సమయంలో మురుగదాస్ ఇంట్లో లేరని తెలుసుకొని తిరిగి వెళ్లిపోయారు. ఈ విషయాన్నీ మురుగదాస్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. 'నిన్న రాత్రి పోలీసులు నా ఇంటికి వచ్చి పలు మార్లు బెల్‌ రింగ్‌ చేశారు. నేను ఇంట్లో లేకపోవడంతో వారు వెళ్ళిపోయారు. ఇపుడు నా ఇంటి వద్ద పోలీసులు ఎవరూ లేరని తెలిసిందని మురుగదాస్‌ ట్వీట్‌ చేశారు. మురుగదాస్‌ను అరెస్ట్‌ చేసేందుకు చెన్నై పోలీసులు ప్రయత్నించారని సర్కార్‌ సినిమా నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ సైతం తెలిపింది.మరోపక్క చిత్ర నిర్మాతలు ఈ వివాదం ఫై స్పందించారు. ఫిర్యాదులో తెలిపినట్లు ఆ సన్నివేశాలని శుక్రవారం నుండి తొలగిస్తున్నట్లు తెలిపారు.

ప్రచురించబడింది: 09-11-2018 11:01:06


మరిన్నీ సినిమా వార్తలు

దీక్షితా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ కొత్త చిత్ర ప్రారంభం...!
దీక్షితా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ కొత్త చిత్ర ప్రారంభం...!
ఘనంగా ప్రసాద్ లాబ్స్ లో 'పార్టీ' మూవీ ఆడియో లాంచ్‌
ఘనంగా ప్రసాద్ లాబ్స్ లో 'పార్టీ' మూవీ ఆడియో లాంచ్‌
కర్ణుడిగా పాత్రలో బాబాయ్...అర్జునిడి పాత్రలో నందమూరి అబ్బాయి...!
కర్ణుడిగా పాత్రలో బాబాయ్...అర్జునిడి పాత్రలో నందమూరి అబ్బాయి...!
అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్న మెగాస్టార్ చిరంజీవి...!
అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్న మెగాస్టార్ చిరంజీవి...!
సెన్సార్ కార్యక్రమాలు  పూర్తిచేసుకున్న రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’...!
సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’...!
విడుదలకు సిద్ధమవుతోన్న 'ఉన్మాది'
విడుదలకు సిద్ధమవుతోన్న 'ఉన్మాది'
ప్రెస్ నోట్స్


సినిమా వార్తలు
రాజకీయ వార్తలు