Advertisement


హొమ్ /సినిమా వార్తలు / ‘టాక్సీవాల’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అధితిగా ప్రముఖ హీరో...!

‘టాక్సీవాల’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అధితిగా ప్రముఖ హీరో...!

టాలీవుడ్‌లో యంగ్‌ హీరోల్లో మోస్ట్‌ క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ.'అర్జున్‌ రెడ్డి', 'గీత గోవిందం' లాంటి హిట్ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌లను దక్కించుకున్న విజయ్‌ దేవరకొండ తాజాగా రాహుల్ సంకర్తియాన్ దర్శకత్వంలో నటించిన సినిమా ‘టాక్సీవాల’.ఈ సినిమా విడుదలకు సిద్ధం గా ఉంది. ఈ చిత్రాన్ని అల్లు అర్జున్‌కు ఆప్తుడు అయిన ఎస్‌ కే ఎన్‌ నిర్మించాడు. దాంతో ఈ సినిమా ప్రమోషన్‌ లో అల్లు అర్జున్‌ పాల్గొనేందుకు ముందుకు వచ్చాడు. అల్లు అర్జున్‌ ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకకు ముఖ్య అధితిగా రాబోతునట్లు సమాచారం. ఈనెల 11న పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్‌ వేడుక జరుగబోతుంది. అందుకు సంబంధించిన కార్యక్రమం ఏర్పాట్లు జరుగుతున్నాయి. బన్నీ గతంలో బన్నీ వాసు కోసం 'గీత గోవిందం' చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో పాల్గొన్నాడు. ఇప్పుడు మరోసారి విజయ్ దేవరకొండ ‘ట్యాక్సీవాలా’ కార్యక్రమంకు రాబోతున్నాడు. ఈ సినిమాను GA2 పిక్చర్స్ పతాకంపై ఎస్‌ కే ఎన్‌ నిర్మిస్తున్నాడు.జాక్స్ బెజోయ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా ఈ నెల 17 న ప్రేక్షకుల ముందుకి రానుంది.

ప్రచురించబడింది: 09-11-2018 11:31:03


మరిన్నీ సినిమా వార్తలు

దీక్షితా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ కొత్త చిత్ర ప్రారంభం...!
దీక్షితా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ కొత్త చిత్ర ప్రారంభం...!
ఘనంగా ప్రసాద్ లాబ్స్ లో 'పార్టీ' మూవీ ఆడియో లాంచ్‌
ఘనంగా ప్రసాద్ లాబ్స్ లో 'పార్టీ' మూవీ ఆడియో లాంచ్‌
కర్ణుడిగా పాత్రలో బాబాయ్...అర్జునిడి పాత్రలో నందమూరి అబ్బాయి...!
కర్ణుడిగా పాత్రలో బాబాయ్...అర్జునిడి పాత్రలో నందమూరి అబ్బాయి...!
అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్న మెగాస్టార్ చిరంజీవి...!
అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్న మెగాస్టార్ చిరంజీవి...!
సెన్సార్ కార్యక్రమాలు  పూర్తిచేసుకున్న రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’...!
సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’...!
విడుదలకు సిద్ధమవుతోన్న 'ఉన్మాది'
విడుదలకు సిద్ధమవుతోన్న 'ఉన్మాది'
ప్రెస్ నోట్స్


సినిమా వార్తలు
రాజకీయ వార్తలు