Advertisement


హొమ్ /సినిమా వార్తలు / విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని సినిమా...!

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని సినిమా...!'మనం' చిత్రం దర్శకుడు విక్రమ్‌ కుమార్ దర్శకత్వంలో నాని తన 24వ సినిమా చేస్తున్నాడు. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఆదివారం విడుదలైంది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఫిబ్రవరి 19న మొదలుకానుంది. ఈ సినిమా గురించి నాని ఆదివారం ట్విట్టర్‌లో ఆసక్తికరమైన పోస్ట్‌ చేశారు. 'నేను, విక్రమ్‌ ఇంకా ఆ మిగతా ఐదుగురు. వచ్చే సంవత్సరంలో. అమ్మాయిలూ ఇది మీ కోసమే'అని పోస్ట్‌ చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ' నాని హీరోగా, సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో మా సంస్థలో సినిమాను నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. విజువల్స్‌తో వండర్లు చేసే పీసీ శ్రీరామ్‌ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. త్వరలోనే ఇతర నటీనటులను, సాంకేతిక నిపుణుల పేర్లను వెల్లడిస్తాం' అని తెలిపారు.


ప్రచురించబడింది: 03-12-2018 11:20:53


TAGS:

మరిన్నీ సినిమా వార్తలు

ఎన్టీఆర్ బయోపిక్ రెండో పాట విడుదల...!
ఎన్టీఆర్ బయోపిక్ రెండో పాట విడుదల...!
హ్యాపీ బర్త్ డే రజినీకాంత్
హ్యాపీ బర్త్ డే రజినీకాంత్
మూడు భాషల్లో ఒకేసారి విడుదల అవుతున్న ‘మణికర్ణిక’
మూడు భాషల్లో ఒకేసారి విడుదల అవుతున్న ‘మణికర్ణిక’
కెసిఆర్ ని అభినందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్...!
కెసిఆర్ ని అభినందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్...!
‘పడి పడి లేచే మనసు’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు...!
‘పడి పడి లేచే మనసు’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు...!
ప్రేమ‌క‌థాచిత్రమ్ 2 హింది శాటిలైట్‌, డ‌బ్బింగ్ రైట్స్ 1 కొటి 43 ల‌క్ష‌లు
ప్రేమ‌క‌థాచిత్రమ్ 2 హింది శాటిలైట్‌, డ‌బ్బింగ్ రైట్స్ 1 కొటి 43 ల‌క్ష‌లు

ప్రెస్ నోట్స్
సినిమా వార్తలు


రాజకీయ వార్తలు