Advertisement


హొమ్ /సినిమా వార్తలు / ‘భారతీయుడు2’ లో కమల్ సరసన కాజల్...!

‘భారతీయుడు2’ లో కమల్ సరసన కాజల్...!



శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ హీరో కమల్‌హాసన్‌ హీరోగా 22 ఏళ్ల క్రితం వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న చిత్రం ‘భారతీయుడు 2’. అయితే ఈ సినిమాలో కమల్ సరసన్ హీరోయిన్ గా కాజల్‌ అగర్వాల్‌ లక్కీ ఛాన్స్ కొట్టింది. ఈ నెల 14న ఈ సినిమా ప్రారంభోత్సవం జరగనుందని సమాచారం. ఇటివలే లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ కాజల్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు సోషల్‌ మీడియాలో సోమవారం ప్రకటించింది. ఇదిలావుండగా పాత్రలో ఆహార్యం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఇటీవల కమల్‌హాసన్‌కు ప్రత్యేకంగా మేకప్‌ చేయించి, ఫొటోలు తీయించారట దర్శకుడు శంకర్‌. కమల్‌ మేకప్‌, గెటప్‌ అద్భుతంగా కుదిరిందని శంకర్‌ సంతృప్తి చెందారని సమాచారం. తాజాగా కాజల్‌ ఎంపిక కూడా పూర్తి కావడంతో పాత్రలో ఆమెకు మేకప్‌ ఎలా ఉంటే బావుంటుందో అవగాహనకు వచ్చేందుకు ఆమెను విదేశాలకు పంపుతున్నారట.అలాగే ఈ సినిమాలో తెలుగు కమెడియన్ వెన్నెల కిశోర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.


ప్రచురించబడింది: 04-12-2018 11:18:31


TAGS:

మరిన్నీ సినిమా వార్తలు

ఎన్టీఆర్ బయోపిక్ రెండో పాట విడుదల...!
ఎన్టీఆర్ బయోపిక్ రెండో పాట విడుదల...!
హ్యాపీ బర్త్ డే రజినీకాంత్
హ్యాపీ బర్త్ డే రజినీకాంత్
మూడు భాషల్లో ఒకేసారి విడుదల అవుతున్న ‘మణికర్ణిక’
మూడు భాషల్లో ఒకేసారి విడుదల అవుతున్న ‘మణికర్ణిక’
కెసిఆర్ ని అభినందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్...!
కెసిఆర్ ని అభినందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్...!
‘పడి పడి లేచే మనసు’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు...!
‘పడి పడి లేచే మనసు’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు...!
ప్రేమ‌క‌థాచిత్రమ్ 2 హింది శాటిలైట్‌, డ‌బ్బింగ్ రైట్స్ 1 కొటి 43 ల‌క్ష‌లు
ప్రేమ‌క‌థాచిత్రమ్ 2 హింది శాటిలైట్‌, డ‌బ్బింగ్ రైట్స్ 1 కొటి 43 ల‌క్ష‌లు

ప్రెస్ నోట్స్




సినిమా వార్తలు


రాజకీయ వార్తలు