Advertisement


హొమ్ /రాజకీయ వార్తలు / మాజీ మంత్రి రామచంద్రయ్య కాంగ్రెస్‌కు రాజీనామా...!

మాజీ మంత్రి రామచంద్రయ్య కాంగ్రెస్‌కు రాజీనామా...!

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్-టిడిపి పొత్తు ఖాయం అవడంతో టీడీపీ - కాంగ్రెస్ కలయికను కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో నాయకులూ ఒకరి తరువాత ఒకరు రాజీనామా చేస్తున్నారు.ఇటివలే కాంగ్రెస్ సీనియర్ నేత వట్టి వసంత్ కుమార్ రాజీనామా చేయగా తాజాగా మరో సీనియర్ నేత కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్-టీడీపీ కలయికను నిరసిస్తూ మాజీ మంత్రి సి.రామచంద్రయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మొదటి నుంచి తాను చంద్రబాబు విధానాలను వ్యతిరేకిస్తున్నట్టు రామచంద్రయ్య చెప్పారు. విభజన సమయంలో చంద్రబాబు వేసిన వ్యాఖ్యలు తాను మరిచిపోలేనని అన్నారు. తన రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు ఎన్ని నాటకాలైనా ఆడతారని రామచంద్రయ్య విమర్శించారు. అధికారం కోసం చంద్రబాబు ఏ పార్టీతోనైనా కలుస్తారు - విడిపోతారని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ఈ రోజు ఈ గతి పట్టడానికి కారణం చంద్రబాబే అని ఆయన ఆరోపించారు. టీడీపీతో కాంగ్రెస్ పొత్తును తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సి. రామచంద్రయ్య చెప్పారు.కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన ఆయన ఏ పార్టీలో చేరతారో చూడాలి.

ప్రచురించబడింది: 03-11-2018 14:38:02




మరిన్నీ రాజకీయ వార్తలు

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామచంద్రయ్య...!
జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామచంద్రయ్య...!
నవంబర్ 14న శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం...!
నవంబర్ 14న శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం...!
కాకినాడలో ముస్లింలతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ...!
కాకినాడలో ముస్లింలతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ...!
 కేంద్రం సహకరించకున్నా పోరాడి అభివృద్ధికి బాటలు వేసుకున్నం:చంద్రబాబు
కేంద్రం సహకరించకున్నా పోరాడి అభివృద్ధికి బాటలు వేసుకున్నం:చంద్రబాబు
కాకినాడలో జనసేన ఫ్లెక్సీల తొలగింపు…కార్యకర్తల ఆందోళన…!
కాకినాడలో జనసేన ఫ్లెక్సీల తొలగింపు…కార్యకర్తల ఆందోళన…!
నేటి నుంచి విశాఖ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర...!
నేటి నుంచి విశాఖ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర...!
జగన్ పై జరిగిన దాడి ఘటనపై రేపు మీడియా ముందుకు విజయమ్మ...!
జగన్ పై జరిగిన దాడి ఘటనపై రేపు మీడియా ముందుకు విజయమ్మ...!
వైసీపీలో చేరనున్న కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య...!
వైసీపీలో చేరనున్న కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య...!
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలరాజు...!
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలరాజు...!
ప్రెస్ నోట్స్


రాజకీయ వార్తలు
సినిమా వార్తలు