Advertisement

హొమ్ /రాజకీయ వార్తలు / తుని లో చంద్రబాబు పై విమర్శల వర్షం కురిపించిన పవన్...!

తుని లో చంద్రబాబు పై విమర్శల వర్షం కురిపించిన పవన్...!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం విజయవాడ నుండి తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణం వరుకు రైలు యాత్ర చేసారు.ఈ యాత్రలో భాగంగా ప్రతి స్టేషన్ లోను సామాన్య ప్రజలతో సంభాషించారు.అనంతరం తునిలో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అయన ప్రసంగించారు.ఈ సందర్భంగా మాట్లాడతూ -అవసరమైతే గొంతైనా కోసుకుంటానుగాని జనసేనను ఏ పార్టీలో విలీనం చేసే ప్రసక్తే రాదు. అలాగే ఏ పార్టీతో పొత్తుండదు,అన్ని స్థానాల్నుంచి పోటీ చేస్తాం.. రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకుంటా మంటూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ విస్పష్టంగా ప్రకటించారు.ఈ సభలో పవన్‌కళ్యాణ్‌ ముఖ్య మంత్రి చంద్రబాబు తీరును తీవ్రంగా తూర్పారబట్టారు.రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించిన బాబు పై పవన్ వ్యంగాస్త్రాలు ఎలా ఉన్నాయో చూద్దాం.తెలుగు జాతికి పౌరుషం, ఆత్మాభిమానం నిండుగా ఉన్నాయని, వాటికి ఎవరు తాకట్టు పెట్టిన జనం సహించబోరని జనసేనాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అడ్డగోలుగా కాంగ్రెస్ ఉమ్మడి ఏపీని విభజిస్తే ఆ పార్టీతో పొత్తు కోసం వెంపర్లాడతారా అంటూ చంద్రబాబుని నిలదీశారు. తెలుగుదేశం ఎంపీలను కొట్టించిన పార్టీని కౌగలించుకోవడమేంటని ప్రశ్నించారు.

ఎంతసేపూ అధికారం చుట్టూనే మీ రాజకీయం తిరుగుతుందా, ప్రజలకు మేలు చేయలని కనీసం అనిపించదా అంటూ పవన్ మండిపడ్డారు. కాంగ్రెస్ ని ఇంతవరకు తిట్టి ఇపుడు వాళ్ళతో కలసి పొటోలు దిగడానికి మనసెలా వచ్చిందని పవన్ నిగ్గదీశారు.జాతీయ పార్టీలు రెండూ ఏపీకి తీరని అన్యాయం చేశాయని పవన్ విరుచుకుపడ్డారు. అటువంటి పార్టీలతో జత కట్టడం ద్వారా బాబు కూడా ఏపీకి ద్రోహం చేశారని ఫైర్ అయ్యారు.చంద్రబాబు లాంటి వారు ఈ రాష్ట్రానికి అవసరమా అని పవన్ తుని వద్ద జరిగిన బహిరంగ సభలో జనాలను ప్రశ్నించారు. ఏపీకి ఏమీ చేయకుండా రాజకీయమే జీవితం అనుకుంటున్న టీడీపీకి 2019 ఎన్నికల్లో ప్రజలు తమ కోపాన్ని ఓటు ద్వారా చూపించి గద్దె దించుతారని పవన్ స్పష్టం చేశారు.

ప్రచురించబడింది: 03-11-2018 15:17:17
మరిన్నీ రాజకీయ వార్తలు

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామచంద్రయ్య...!
జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామచంద్రయ్య...!
నవంబర్ 14న శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం...!
నవంబర్ 14న శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం...!
కాకినాడలో ముస్లింలతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ...!
కాకినాడలో ముస్లింలతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ...!
 కేంద్రం సహకరించకున్నా పోరాడి అభివృద్ధికి బాటలు వేసుకున్నం:చంద్రబాబు
కేంద్రం సహకరించకున్నా పోరాడి అభివృద్ధికి బాటలు వేసుకున్నం:చంద్రబాబు
కాకినాడలో జనసేన ఫ్లెక్సీల తొలగింపు…కార్యకర్తల ఆందోళన…!
కాకినాడలో జనసేన ఫ్లెక్సీల తొలగింపు…కార్యకర్తల ఆందోళన…!
నేటి నుంచి విశాఖ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర...!
నేటి నుంచి విశాఖ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర...!
జగన్ పై జరిగిన దాడి ఘటనపై రేపు మీడియా ముందుకు విజయమ్మ...!
జగన్ పై జరిగిన దాడి ఘటనపై రేపు మీడియా ముందుకు విజయమ్మ...!
వైసీపీలో చేరనున్న కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య...!
వైసీపీలో చేరనున్న కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య...!
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలరాజు...!
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలరాజు...!
ప్రెస్ నోట్స్

రాజకీయ వార్తలు
సినిమా వార్తలు