Advertisement


హొమ్ /రాజకీయ వార్తలు / ఎవరో చేయించిన పనికి నా తమ్ముడు బలయ్యాడు: శ్రీనివాసరావు సోదరి

ఎవరో చేయించిన పనికి నా తమ్ముడు బలయ్యాడు: శ్రీనివాసరావు సోదరి

వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఇటివలే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో శ్రీనివాసరావు హత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే.శ్రీనివాసరావు ని ఎయిర్పోర్ట్ పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు.అయితే శ్రీనివాసరావు సోదరి రత్నకుమారి మాట్లాడతూ హత్యాయత్నాన్ని తన తమ్ముడితో ఎవరో చేయించారని అనుమానం వ్యక్తం చేశారు. ఎవరు చేయించారో చెబుదామన్నా చేయించిన వాళ్లు అతడిని బెదిరించి ఉంటారని, అందుకే చెప్పడం లేదేమో అంటూ ఆమె తెలిపింది. వాళ్లు డబ్బు ఇస్తామని ఆశ పెట్టి ఉంటారని, అందుకే ఇలా చేశాడని ఆమె కన్నీరుతో తెలిపింది.చేతిలో రూపాయి కూడా లేని శ్రీనివాసరావు ఇంతటి దారుణానికి ఒడిగడతాడని తాము ఊహించలేదని, ఇందుకు కారకులైన వారు ఇప్పుడు తన తమ్ముడిని ఏమి చేస్తారోనని భయంగా ఉందని రత్నకుమారి పేర్కొంది. ఎవరో చేయించిన పనికి తన తమ్ముడు బలైపోయాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఎప్పుడూ చిన్న ఫోన్‌ను వాడే తమ తమ్ముడు 9ఫోన్లు మార్చాడంటేనే నమ్మలేకపోయామని.. రూ.20, రూ.30లు కూడా అడిగి తీసుకొని వెళ్లేవాడని రత్నకుమారి చెప్పింది.

ప్రచురించబడింది: 05-11-2018 14:42:36




మరిన్నీ రాజకీయ వార్తలు

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామచంద్రయ్య...!
జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామచంద్రయ్య...!
నవంబర్ 14న శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం...!
నవంబర్ 14న శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం...!
కాకినాడలో ముస్లింలతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ...!
కాకినాడలో ముస్లింలతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ...!
 కేంద్రం సహకరించకున్నా పోరాడి అభివృద్ధికి బాటలు వేసుకున్నం:చంద్రబాబు
కేంద్రం సహకరించకున్నా పోరాడి అభివృద్ధికి బాటలు వేసుకున్నం:చంద్రబాబు
కాకినాడలో జనసేన ఫ్లెక్సీల తొలగింపు…కార్యకర్తల ఆందోళన…!
కాకినాడలో జనసేన ఫ్లెక్సీల తొలగింపు…కార్యకర్తల ఆందోళన…!
నేటి నుంచి విశాఖ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర...!
నేటి నుంచి విశాఖ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర...!
జగన్ పై జరిగిన దాడి ఘటనపై రేపు మీడియా ముందుకు విజయమ్మ...!
జగన్ పై జరిగిన దాడి ఘటనపై రేపు మీడియా ముందుకు విజయమ్మ...!
వైసీపీలో చేరనున్న కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య...!
వైసీపీలో చేరనున్న కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య...!
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలరాజు...!
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలరాజు...!
ప్రెస్ నోట్స్


రాజకీయ వార్తలు
సినిమా వార్తలు