Advertisement

హొమ్ /రాజకీయ వార్తలు / కాకినాడ ఎస్ఈజెడ్ నిర్వాసితులుతో పవన్ కల్యాణ్ భేటి...!

కాకినాడ ఎస్ఈజెడ్ నిర్వాసితులుతో పవన్ కల్యాణ్ భేటి...!

ప్రజా పోరాట యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.దీనిలో భాగంగా ఈరోజు అయన కాకినాడలోని జీ కన్వెన్షన్ సెంటర్ లో ఎస్ఈజెడ్ నిర్వాసితులు, రైతులతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుత- సెజ్ ల పేరుతో అడ్డగోలుగా భూదోపిడీ చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రైతుల వద్ద భూమి తీసుకున్నా పరిశ్రమలు ఏమైనా స్థాపించారా అంటే అదీ లేదన్నారు. రైతుల నుంచి భూమి లాక్కొని వారు సొమ్ము చేసుకుంటున్నారన్నారు. వేల కోట్లు సంపాదించి ఏం చేస్తారని ప్రశ్నించారు. దోపిడీలు, భూకబ్జాలు చేసేదేమో వారు ప్రశ్నిస్తే తీవ్రవాదిగా ముద్ర వేస్తారన్నారు. అడ్డగోలుగా మైనింగ్ చేస్తున్నారని ఆయన అన్నారు. అధికారంలోకి రాక ముందు చెప్పేదొకటి, అధికారం వచ్చాక మరొకటి చేస్తారన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ముందుగా చేసే పని ఎస్ఈజెడ్ రైతులపై ఉన్న కేసులను ఎత్తివేస్తానని అన్నారు. రైతులు దొంగల్లాగ జైలుకెళ్లడమేంటని ప్రశ్నించారు. అసలైన దొంగలు, దేశాన్ని దోచేసిన దొంగలు విదేశాల్లో దర్జాగా తిరుగుతున్నారన్నారు. స్పెషల ఫ్లైట్లు, లగ్జరీ రూమ్ లలో ఎంజాయ్ చేస్తున్నారన్నారు. సాధ్యమైనంత మేరకు రైతులకు అండగా ఉంటానని, రైతులపై కేసుల్లేకుండా చేస్తానన్నారు. రైతులపై ఉన్న కేసులను తీయించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. చట్టపరమైన ఇబ్బందులేమున్నా వాటిని ఎలా అధిగమించాలనేది ఖచ్చితంగా చేస్తానన్నారు.

పాలకులు ప్రభువులు ప్రజలకు తల్లిదండ్రులుగా వ్యవహరించాలని అన్నారు. సమస్యలు పరిష్కారం కావాలంటే పాలకులను చొక్కా పట్టుకొని నిలదీస్తే తప్ప పరిష్కారం దొరకడం లేదన్నారు. శాంతిని నెలకొల్పడానికి కూడా కత్తి అండగా కావాల్సిన రోజులు ఇవాళ ఉన్నాయన్నారు. ప్రకృతినే విధ్వంసం చేస్తుండడంతో ప్రజలు రాజకీయ నాయకులంటేనే భయాందోళనకు గురయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. భూములు తీసుకున్న రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలన్నారు. పొట్టిశ్రీరాములు త్యాగాన్ని వృధా చేయనివ్వమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రక్షించడానికి జనసేన ఉందన్నారు. రాజకీయ నేతలు తీసుకోవడానికి ఉన్నారు తప్ప, ఇవ్వడానికి లేరన్నారు. భయపడకుండా అన్యాయాన్ని ఎదిరించండి అంటూ పిలుపునిచ్చారు. జనసేన పార్టీ అందరికీ అండగా ఉంటుందన్నారు. పరిశ్రమల పేరుతో వేల ఎకరాల భూములను రైతుల నుంచి లాక్కొని పరిశ్రమలు పెట్టరు,ఉద్యోగాలు ఇవ్వరని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రచురించబడింది: 06-11-2018 16:53:42
మరిన్నీ రాజకీయ వార్తలు

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామచంద్రయ్య...!
జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామచంద్రయ్య...!
నవంబర్ 14న శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం...!
నవంబర్ 14న శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం...!
కాకినాడలో ముస్లింలతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ...!
కాకినాడలో ముస్లింలతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ...!
 కేంద్రం సహకరించకున్నా పోరాడి అభివృద్ధికి బాటలు వేసుకున్నం:చంద్రబాబు
కేంద్రం సహకరించకున్నా పోరాడి అభివృద్ధికి బాటలు వేసుకున్నం:చంద్రబాబు
కాకినాడలో జనసేన ఫ్లెక్సీల తొలగింపు…కార్యకర్తల ఆందోళన…!
కాకినాడలో జనసేన ఫ్లెక్సీల తొలగింపు…కార్యకర్తల ఆందోళన…!
నేటి నుంచి విశాఖ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర...!
నేటి నుంచి విశాఖ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర...!
జగన్ పై జరిగిన దాడి ఘటనపై రేపు మీడియా ముందుకు విజయమ్మ...!
జగన్ పై జరిగిన దాడి ఘటనపై రేపు మీడియా ముందుకు విజయమ్మ...!
వైసీపీలో చేరనున్న కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య...!
వైసీపీలో చేరనున్న కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య...!
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలరాజు...!
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలరాజు...!
ప్రెస్ నోట్స్

రాజకీయ వార్తలు
సినిమా వార్తలు