Advertisement


హొమ్ /రాజకీయ వార్తలు / ఆత్మగౌరవం కోసం గొంతు కోసుకునే వ్యక్తిని నేను: పవన్ కళ్యాణ్

ఆత్మగౌరవం కోసం గొంతు కోసుకునే వ్యక్తిని నేను: పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తో పాటు వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిని, ప్రధాని నరేంద్ర మోడీలపై విమర్శలదాడి చేశారు. జనసేన ప్రజాపోరాట యాత్రలో భాగంగా మంగళవారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు హెరిటేజ్‌ వ్యాపారం, జగన్‌కు కాంట్రాక్టులు ఆగిపోతాయని తెలంగాణ అంటేనే వారికి భయం పట్టుకుందన్నారు. జగన్‌ను వరంగల్‌లో కొట్టి తరిమేశారన్నారు.తెలంగాణ ప్రజలు ఇద్దరినీ రానివ్వరన్నారు. కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా మాట్లాడతాం కాబట్టే రెండు రాష్ట్రాలకూ జనసైనికులు వెళ్లగలరని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో దశాబ్దాలుగా ఉన్న నాయకులు మిగిలిన పార్టీలవైపు వస్తుంటే చంద్రబాబు వారి కాళ్లు పట్టుకుని అటువైపు వెళ్లడం బాధ కలిగించిందన్నారు.పైగా, ప్రధాని నరేంద్ర మోడీకి తాను దత్తపుత్రుడను కాదంటూ.. లోకేష్‌ కుమారుడు మోడీని తాతా తాతా అంటాడు వారికే ఆయనతో బంధుత్వాలు ఉన్నాయి. తనకు మోడీపై ఎటువంటి మోజూ లేదు, భయమూ లేదన్నారు. 'మీలా రెండు చేతులతో గులాం చేసే వాడిని కాదు ఆత్మగౌరవం కోసం గొంతు కోసుకునే వ్యక్తిని' అని అంటూ వ్యాఖ్యానించారు.

ప్రచురించబడింది: 08-11-2018 14:27:34




మరిన్నీ రాజకీయ వార్తలు

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామచంద్రయ్య...!
జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామచంద్రయ్య...!
నవంబర్ 14న శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం...!
నవంబర్ 14న శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం...!
కాకినాడలో ముస్లింలతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ...!
కాకినాడలో ముస్లింలతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ...!
 కేంద్రం సహకరించకున్నా పోరాడి అభివృద్ధికి బాటలు వేసుకున్నం:చంద్రబాబు
కేంద్రం సహకరించకున్నా పోరాడి అభివృద్ధికి బాటలు వేసుకున్నం:చంద్రబాబు
కాకినాడలో జనసేన ఫ్లెక్సీల తొలగింపు…కార్యకర్తల ఆందోళన…!
కాకినాడలో జనసేన ఫ్లెక్సీల తొలగింపు…కార్యకర్తల ఆందోళన…!
నేటి నుంచి విశాఖ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర...!
నేటి నుంచి విశాఖ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర...!
జగన్ పై జరిగిన దాడి ఘటనపై రేపు మీడియా ముందుకు విజయమ్మ...!
జగన్ పై జరిగిన దాడి ఘటనపై రేపు మీడియా ముందుకు విజయమ్మ...!
వైసీపీలో చేరనున్న కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య...!
వైసీపీలో చేరనున్న కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య...!
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలరాజు...!
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలరాజు...!
ప్రెస్ నోట్స్


రాజకీయ వార్తలు
సినిమా వార్తలు