Advertisement


హొమ్ /రాజకీయ వార్తలు / తాడేపల్లిగూడెంలో టిడిపి‌ ,బిజెపి పార్టీల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితి...!

తాడేపల్లిగూడెంలో టిడిపి‌ ,బిజెపి పార్టీల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితి...!

ప.గో.జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు, టిడిపి జడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు బహిరంగ చర్చలకు సిద్ధం అయ్యారు.దీంతో తాడేపల్లిగూడెం పట్టణంలోని మాణిక్యాలరావు నివాసం వద్ద మండలం లోని వెంకట్రామన్నగూడెం గ్రామంలోనూ నలుగురు సిఐలు, పదిమంది ఎస్సైలు, 100మంది పోలీసు సిబ్బంది మోహరించారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని మాణిక్యాలరావు నివాసం వద్ద కొవ్వూరు ట్రాఫిక్ డిఎస్పీ ఆధ్వర్యంలో గృహానిర్బందానికి రంగం సిద్ధం చేసారు.నిన్న రాత్రే టిడిపి జడ్పీ చైర్మన్ బాపిరాజు వెంకట్రామన్నగూడెం చేరుకున్నారు.దీంతో తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెం గ్రామంలో పూసులూరి పుల్లారావు అనే తెలుగుదేశం కార్యకర్త ఇంట్లో బాపిరాజును ఏలూరు డిఎస్పీ మురళీకృష్ణ గృహానిర్బంధం చేసారు. అవసరం మేరకు తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ ని కూడా గృహానిర్బందం చేసేందకు అయన నివాసం వద్ద కూడా పోలీసులు మోహరించారు. పోలీసులు గృహానిర్బంధం చేయడంతో మాణిక్యాలరావు మరియు బీజేపీ శ్రేణులు బయటకొచ్చి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేసారు.దీంతో కొంత సేపు పోలీసులకి, బీజేపీ శ్రేణులకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే నివాసంలో ఉద్రిక్తత కొనసాగుతుంది. బీజేపీ నేత సోము వీర్రాజు ఎమ్మెల్యే మాణిక్యాలరావు నివాసానికి చేరుకున్నారు. కాగా మరోమారు గృహానిర్బంధం నుంచి బయటకు వచ్చేందుకు ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు ఇంటి గోడపై పైనుంచి బయటకు దూకారు .దిని అడుకోవడంతో పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. కార్యకర్తలు గేట్లు పగులకొట్టి బయటకొస్తున్నారు .ఇరు పార్టీ వర్గాల మధ్య హైడ్రామా కొనసాగుతుంది.ఉద్రిక్త పరిస్తిని కట్టడి చేసేందకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ప్రచురించబడింది: 08-11-2018 16:49:14




మరిన్నీ రాజకీయ వార్తలు

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామచంద్రయ్య...!
జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామచంద్రయ్య...!
నవంబర్ 14న శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం...!
నవంబర్ 14న శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం...!
కాకినాడలో ముస్లింలతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ...!
కాకినాడలో ముస్లింలతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ...!
 కేంద్రం సహకరించకున్నా పోరాడి అభివృద్ధికి బాటలు వేసుకున్నం:చంద్రబాబు
కేంద్రం సహకరించకున్నా పోరాడి అభివృద్ధికి బాటలు వేసుకున్నం:చంద్రబాబు
కాకినాడలో జనసేన ఫ్లెక్సీల తొలగింపు…కార్యకర్తల ఆందోళన…!
కాకినాడలో జనసేన ఫ్లెక్సీల తొలగింపు…కార్యకర్తల ఆందోళన…!
నేటి నుంచి విశాఖ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర...!
నేటి నుంచి విశాఖ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర...!
జగన్ పై జరిగిన దాడి ఘటనపై రేపు మీడియా ముందుకు విజయమ్మ...!
జగన్ పై జరిగిన దాడి ఘటనపై రేపు మీడియా ముందుకు విజయమ్మ...!
వైసీపీలో చేరనున్న కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య...!
వైసీపీలో చేరనున్న కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య...!
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలరాజు...!
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలరాజు...!
ప్రెస్ నోట్స్


రాజకీయ వార్తలు
సినిమా వార్తలు