Advertisement


హొమ్ /రాజకీయ వార్తలు / పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన టిడిపి మాజీమంత్రి రావెల...!

పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన టిడిపి మాజీమంత్రి రావెల...!

టిడిపి మాజీ మంత్రి,ప్రత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిశోర్‌బాబు ఈరోజు ఉదయం జనసేన పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ కిశోరే బాబు కి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్‌, పసుపులేటి బాలరాజు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కిశోర్ బాబు మాట్లాడతూ-ఆత్మగౌరవం, ఆత్మాభిమానం చంపుకుని టీడీపీలో ఉండలేక బయటకు వచ్చినట్లు వెల్లడించారు. పదవులు ఇస్తారు.. అధికారం మాత్రం చంద్రబాబు దగ్గరే ఉంటుందన్నారు. పని చేసే స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఇవ్వలేదంటూ సంచలన కామెంట్స్ చేశారు. సాంఘీక, గిరిజన సంక్షేమ శాఖ నిర్వహణలో నెంబర్ వన్ మంత్రిగా ఉన్నానని, టీడీపీ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లిన గుర్తింపు కూడా ఉందన్నారు రావెల. మంత్రిగా ఉన్నా పదవి అలంకారప్రాయంగానే ఉందని, అధికారాలు అన్నీ ఆయన దగ్గరే ఉన్నాయని వివరించారాయన. సీఎం చంద్రబాబు చెప్పేది ఒకటి అయితే చేసేది మరొకటి ఉంటుందన్నారు. మాటలు,చేతలకు తేడా ఉంటుందన్నారు. ప్రతి వ్యక్తికి ఆత్మగౌరవం, ఆత్మాభిమానం ఉంటాయని,వాటికి భంగం కలిగినప్పుడు అక్కడ ఉండటం భావ్యం కాదన్నారు. దళితులు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం కావాలని నినదిస్తున్న పవన్ కల్యాణ్ వెంట నడవటానికి సిద్ధంగా ఉన్నాను అని ప్రకటించారు రావెల.

ప్రచురించబడింది: 01-12-2018 14:53:38




మరిన్నీ రాజకీయ వార్తలు

టీఆర్ఎస్ గూటికి గెలిచినా ఇండిపెండెంట్ అభ్యర్థులు...!
టీఆర్ఎస్ గూటికి గెలిచినా ఇండిపెండెంట్ అభ్యర్థులు...!
అందరికంటే ఘోర పరాభవం చంద్రబాబుకే!
అందరికంటే ఘోర పరాభవం చంద్రబాబుకే!
చంద్రబాబుని  ఓడించడానికి ఉద్యోగులు చాలు
చంద్రబాబుని ఓడించడానికి ఉద్యోగులు చాలు
ఆంధ్రపై ప్రభావం ఏ మేరకు?
ఆంధ్రపై ప్రభావం ఏ మేరకు?
తెలంగాణ ఫలితంతో మాకు సంబంధం లేదు!
తెలంగాణ ఫలితంతో మాకు సంబంధం లేదు!
రేపు 1.30కి సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం...!
రేపు 1.30కి సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం...!
లోక్ సభ వాయిదా..రాఫెల్ పై ప్రతిపక్షాల నిరసన..
లోక్ సభ వాయిదా..రాఫెల్ పై ప్రతిపక్షాల నిరసన..
తెలంగాణలో కెసిఆర్ విజయంఫై పోసాని ప్రెస్ మీట్...!
తెలంగాణలో కెసిఆర్ విజయంఫై పోసాని ప్రెస్ మీట్...!
నేడు తెలంగాణా భవన్ లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం...!
నేడు తెలంగాణా భవన్ లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం...!
ప్రెస్ నోట్స్


రాజకీయ వార్తలు
సినిమా వార్తలు