Advertisement


హొమ్ /రాజకీయ వార్తలు / జగన్ ఫై హత్యాయత్నం కేసులో ఏపి ప్రభుత్వంఫై హైకోర్టు ఆగ్రహం...!

జగన్ ఫై హత్యాయత్నం కేసులో ఏపి ప్రభుత్వంఫై హైకోర్టు ఆగ్రహం...!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో శ్రీనివాస్ అనే యువకుడు దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసిందే.అయితే ఈ కేసుపై విచారణ చేపట్టిన పిటిషన్ ను హైకోర్టు ఈ రోజు విచారించింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ వ్యవహారశైలిపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో దాడి జరిగితే ఏపీ పోలీసులు ఎందుకు విచారణ చేపట్టారని కోర్టు ప్రశ్నించింది. ఈ కేసును తక్షణం జాతీయ దర్యాప్తు సంస్థకు ఎందుకు అప్పగించలేదో వివరిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.ఈ సందర్భంగా జగన్ తరఫు న్యాయవాది వాదిస్తూ ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ విచారణను నిలిపివేయాలని..జాతీయ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కోరారు. న్నారు. ఈ వాదనలను ఏపీ ప్రభుత్వ న్యాయవాది ఖండించారు. సిట్ అధికారుల విచారణ పారదర్శకంగా, నిష్పాక్షికంగా కొనసాగుతోందని కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. జగన్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించడంపై స్పందించాలని ఆంధ్రప్రదేశ్ తో పాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 5కు వాయిదా వేసింది.

ప్రచురించబడింది: 03-12-2018 14:24:30




మరిన్నీ రాజకీయ వార్తలు

టీఆర్ఎస్ గూటికి గెలిచినా ఇండిపెండెంట్ అభ్యర్థులు...!
టీఆర్ఎస్ గూటికి గెలిచినా ఇండిపెండెంట్ అభ్యర్థులు...!
అందరికంటే ఘోర పరాభవం చంద్రబాబుకే!
అందరికంటే ఘోర పరాభవం చంద్రబాబుకే!
చంద్రబాబుని  ఓడించడానికి ఉద్యోగులు చాలు
చంద్రబాబుని ఓడించడానికి ఉద్యోగులు చాలు
ఆంధ్రపై ప్రభావం ఏ మేరకు?
ఆంధ్రపై ప్రభావం ఏ మేరకు?
తెలంగాణ ఫలితంతో మాకు సంబంధం లేదు!
తెలంగాణ ఫలితంతో మాకు సంబంధం లేదు!
రేపు 1.30కి సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం...!
రేపు 1.30కి సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం...!
లోక్ సభ వాయిదా..రాఫెల్ పై ప్రతిపక్షాల నిరసన..
లోక్ సభ వాయిదా..రాఫెల్ పై ప్రతిపక్షాల నిరసన..
తెలంగాణలో కెసిఆర్ విజయంఫై పోసాని ప్రెస్ మీట్...!
తెలంగాణలో కెసిఆర్ విజయంఫై పోసాని ప్రెస్ మీట్...!
నేడు తెలంగాణా భవన్ లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం...!
నేడు తెలంగాణా భవన్ లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం...!
ప్రెస్ నోట్స్


రాజకీయ వార్తలు
సినిమా వార్తలు