Advertisement


హొమ్ /రాజకీయ వార్తలు / రెండు రోజుల పాటు కొడంగల్‌లో 144 సెక్షన్ అమలు...!

రెండు రోజుల పాటు కొడంగల్‌లో 144 సెక్షన్ అమలు...!

వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఈ రోజు, రేపు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పార్టీలు, నేతలు అంతా సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. కొడంగల్‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఢీ అంటే ఢీ అనే పరిస్థితి నెలకొనడంతో పోలీసులు అప్రమత్తమంగా ఉన్నారు. నియోజకవర్గంలో నిషేధాజ్ఞలు విధిస్తూ, 144 సెక్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు రేవంత్‌రెడ్డికి రిటర్నింగ్ అధికారి నోటీసులు జారీ చేశారు.మరోవైపు రేపు కొడంగల్‌లో టీఆర్ఎస్ ఆశీర్వాద సభ ఉంది. దీనికి కేసీఆర్ హాజరుకానున్న నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి నిరసనలకు పిలుపునిచ్చారు. అన్ని మండల కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేస్తామని స్థానిక నేతలు, వ్యాపారులు ప్రకటించడంతో కొడంగల్ నియోజకవర్గంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. కొడంగల్‌లో పరిస్థితిపై డీజీపీ, కలెక్టర్లు వివరణ ఇవ్వాల్సిందిగా సీఈవో రజత్‌కుమార్ కోరారు. ఒకవైపు కేసీఆర్ సభ, మరోవైపు నిరసన ర్యాలీలకు రేవంత్‌ పిలుపుతో పరిస్థితిని గమనించిన పోలీసు ఉన్నతాధికారులు 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు.

ప్రచురించబడింది: 03-12-2018 17:45:27




మరిన్నీ రాజకీయ వార్తలు

టీఆర్ఎస్ గూటికి గెలిచినా ఇండిపెండెంట్ అభ్యర్థులు...!
టీఆర్ఎస్ గూటికి గెలిచినా ఇండిపెండెంట్ అభ్యర్థులు...!
అందరికంటే ఘోర పరాభవం చంద్రబాబుకే!
అందరికంటే ఘోర పరాభవం చంద్రబాబుకే!
చంద్రబాబుని  ఓడించడానికి ఉద్యోగులు చాలు
చంద్రబాబుని ఓడించడానికి ఉద్యోగులు చాలు
ఆంధ్రపై ప్రభావం ఏ మేరకు?
ఆంధ్రపై ప్రభావం ఏ మేరకు?
తెలంగాణ ఫలితంతో మాకు సంబంధం లేదు!
తెలంగాణ ఫలితంతో మాకు సంబంధం లేదు!
రేపు 1.30కి సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం...!
రేపు 1.30కి సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం...!
లోక్ సభ వాయిదా..రాఫెల్ పై ప్రతిపక్షాల నిరసన..
లోక్ సభ వాయిదా..రాఫెల్ పై ప్రతిపక్షాల నిరసన..
తెలంగాణలో కెసిఆర్ విజయంఫై పోసాని ప్రెస్ మీట్...!
తెలంగాణలో కెసిఆర్ విజయంఫై పోసాని ప్రెస్ మీట్...!
నేడు తెలంగాణా భవన్ లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం...!
నేడు తెలంగాణా భవన్ లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం...!
ప్రెస్ నోట్స్


రాజకీయ వార్తలు
సినిమా వార్తలు