Advertisement


హొమ్ /రాజకీయ వార్తలు / కొడంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి అరెస్ట్...!

కొడంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి అరెస్ట్...!

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, కొడంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ని రాత్రి పోలీసులు అరెస్ట్ చేసారు. దీంతో కాంగ్రెస్ కార్య కర్తలు నియోజకవర్గ బంద్‌కు పిలుపునిచ్చారు.కొడంగల్‌లో హైటెన్షన్ నెలకొంది. ఏ క్షణాన ఏం జరుగుతుందో అని పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. మరోవైపు నేడు కోస్గిలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభ ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సభలో అల్లర్లు సృష్టించేందుకు రేవంత్‌ వర్గీయులు కుట్ర పన్నుతున్నారంటూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఫిర్యాదు చేశారు. సభకు జనం రాకుండా ఆటంకపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా ఆయన ఫిర్యాదు చేయడంతో ఎన్నికల కమిషనర్‌ సీరియస్‌ అయ్యారు.కొడంగల్, కోస్గి వెళ్లే వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. హైదరాబాద్‌-బీజాపూర్‌ రహదారులలో కొడంగల్, కోస్గిలకు వెళ్లే ప్రధాన రహదారులలో తనిఖీలు ముమ్మరం చేశారు. కొడంగల్‌ సెగ్మెంట్‌లో రెండు రోజుల పాటు 144 సెక్షన్‌ విధించినట్లు సమాచారం. ఇక రేవంత్ రెడ్డిని జడ్చర్లలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలించారు.

ప్రచురించబడింది: 04-12-2018 11:28:06
మరిన్నీ రాజకీయ వార్తలు

టీఆర్ఎస్ గూటికి గెలిచినా ఇండిపెండెంట్ అభ్యర్థులు...!
టీఆర్ఎస్ గూటికి గెలిచినా ఇండిపెండెంట్ అభ్యర్థులు...!
అందరికంటే ఘోర పరాభవం చంద్రబాబుకే!
అందరికంటే ఘోర పరాభవం చంద్రబాబుకే!
చంద్రబాబుని  ఓడించడానికి ఉద్యోగులు చాలు
చంద్రబాబుని ఓడించడానికి ఉద్యోగులు చాలు
ఆంధ్రపై ప్రభావం ఏ మేరకు?
ఆంధ్రపై ప్రభావం ఏ మేరకు?
తెలంగాణ ఫలితంతో మాకు సంబంధం లేదు!
తెలంగాణ ఫలితంతో మాకు సంబంధం లేదు!
రేపు 1.30కి సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం...!
రేపు 1.30కి సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం...!
లోక్ సభ వాయిదా..రాఫెల్ పై ప్రతిపక్షాల నిరసన..
లోక్ సభ వాయిదా..రాఫెల్ పై ప్రతిపక్షాల నిరసన..
తెలంగాణలో కెసిఆర్ విజయంఫై పోసాని ప్రెస్ మీట్...!
తెలంగాణలో కెసిఆర్ విజయంఫై పోసాని ప్రెస్ మీట్...!
నేడు తెలంగాణా భవన్ లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం...!
నేడు తెలంగాణా భవన్ లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం...!
ప్రెస్ నోట్స్


రాజకీయ వార్తలు
సినిమా వార్తలు