Advertisement


హొమ్ /రాజకీయ వార్తలు / పార్టీని ప్రజలకు చేరువ చేసేందుకు జనసేన వినూత్న కార్యక్రమం....!

పార్టీని ప్రజలకు చేరువ చేసేందుకు జనసేన వినూత్న కార్యక్రమం....!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజా పోరాట యాత్రతో దూసుకుపోతున్నారు.వెళ్ళిన ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వం చేస్తున్న అవినీతి తో పాటు,ప్రతిపక్షం నేత వైఎస్ జగన్ అసమర్ధతను ప్రశ్నిస్తున్నారు.ఇటివలే అనంతపురం లో చేసిన కరువు కవాతు కి కూడా ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో పార్టీని పూర్తి స్థాయిలో ప్రజలలోకి తీసుకేల్లెందుకు పార్టీ నేతలు దృష్టి సారించారు.దీనిలో భాగంగా పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ నెల 5 నుంచి 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన తరంగం కార్యక్రమం చేపడుతున్నట్లు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రేపటి నుంచి జనసేన తరంగం పేరుతో ప్రారంభిస్తున్న కార్యక్రమ వివరాలను ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా తెలిపారు. ఈ నెల 5న ఉదయం 11 గంటలకు శింగనమల నుంచి జనసేన తరంగం ప్రారంభమవుతుందన్నారు. పార్టీ సిద్ధాంతాలు, హామీలను ప్రజలకు వివరించడమే ముఖ్య ఉద్దేశమని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. చేనేత కార్మికులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని అన్నారు. చేనేత కార్మికుల సమస్యలు తనకు చిన్నప్పటి నుంచే తెలుసునన్నారు. చేనేత కార్మికులకు ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. ఎంత కష్టపడ్డా వారికి ఫలితం దక్కడం లేదన్నారు. ఐదేళ్లకోసారి ఓట్ల కోసం మాత్రమే నేతలు వస్తున్నారన్నారు.

ప్రచురించబడింది: 04-12-2018 14:53:41




మరిన్నీ రాజకీయ వార్తలు

టీఆర్ఎస్ గూటికి గెలిచినా ఇండిపెండెంట్ అభ్యర్థులు...!
టీఆర్ఎస్ గూటికి గెలిచినా ఇండిపెండెంట్ అభ్యర్థులు...!
అందరికంటే ఘోర పరాభవం చంద్రబాబుకే!
అందరికంటే ఘోర పరాభవం చంద్రబాబుకే!
చంద్రబాబుని  ఓడించడానికి ఉద్యోగులు చాలు
చంద్రబాబుని ఓడించడానికి ఉద్యోగులు చాలు
ఆంధ్రపై ప్రభావం ఏ మేరకు?
ఆంధ్రపై ప్రభావం ఏ మేరకు?
తెలంగాణ ఫలితంతో మాకు సంబంధం లేదు!
తెలంగాణ ఫలితంతో మాకు సంబంధం లేదు!
రేపు 1.30కి సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం...!
రేపు 1.30కి సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం...!
లోక్ సభ వాయిదా..రాఫెల్ పై ప్రతిపక్షాల నిరసన..
లోక్ సభ వాయిదా..రాఫెల్ పై ప్రతిపక్షాల నిరసన..
తెలంగాణలో కెసిఆర్ విజయంఫై పోసాని ప్రెస్ మీట్...!
తెలంగాణలో కెసిఆర్ విజయంఫై పోసాని ప్రెస్ మీట్...!
నేడు తెలంగాణా భవన్ లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం...!
నేడు తెలంగాణా భవన్ లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం...!
ప్రెస్ నోట్స్


రాజకీయ వార్తలు
సినిమా వార్తలు