Advertisement


హొమ్ /రాజకీయ వార్తలు / మార్చి 18 నుంచి ఏపిలో పదోవ తరగతి పరిక్షలు...!

మార్చి 18 నుంచి ఏపిలో పదోవ తరగతి పరిక్షలు...!

ఆంధ్రప్రదేశ్ లో టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను మానవవనరుల అభివృద్ధి శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేసారు.పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు నిర్వహించ నున్నట్లు తెలిపారు. విజయవాడ లోని ఒక హోటల్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పరీక్షల షెడ్యూల్‌ను వెల్లడించారు. ఈ ఏడాది 6.10 లక్షల మంది పరీక్షలు రాయనున్నట్టు అంచనా వేశామన్నారు.పరీక్షల నిర్వహణకు 2,835 కేంద్రాల్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమస్యాత్మక ప్రాంతాలు 91 ఉన్నట్లు గుర్తించామనీ, వీటిలో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తామనీ చెప్పారు. 150 ప్లయింగ్‌ స్కాడ్స్‌ తనిఖీలు నిర్వహిస్తారన్నారు. అభ్యర్థులు హాల్‌ టిక్కెట్లు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు.పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 వరకు, మరికొన్ని 9.30 నుంచి 12.45 వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ కమిషనర్‌ జిల్లా అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తారన్నారు. పరీక్షలు జరిగే సమయంలో కేంద్రాల వద్ద ఇంటర్‌నెట్‌, జిరాక్స్‌ సెంటర్లు మూసేస్తామన్నారు. గతంలో ఫలితాలు విడుదల చేయడానికి జాప్యం జరిగేదనీ, 2014 నుంచి పరీక్షలు ముగిసే నెల రోజుల్లోనే మూల్యాంకనం పూర్తి చేసి, ఫలితాల్ని విడుదల చేస్తామన్నారు.విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి, ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ ఎ.సుబ్బారెడ్డి తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

ప్రచురించబడింది: 04-12-2018 17:01:53




మరిన్నీ రాజకీయ వార్తలు

టీఆర్ఎస్ గూటికి గెలిచినా ఇండిపెండెంట్ అభ్యర్థులు...!
టీఆర్ఎస్ గూటికి గెలిచినా ఇండిపెండెంట్ అభ్యర్థులు...!
అందరికంటే ఘోర పరాభవం చంద్రబాబుకే!
అందరికంటే ఘోర పరాభవం చంద్రబాబుకే!
చంద్రబాబుని  ఓడించడానికి ఉద్యోగులు చాలు
చంద్రబాబుని ఓడించడానికి ఉద్యోగులు చాలు
ఆంధ్రపై ప్రభావం ఏ మేరకు?
ఆంధ్రపై ప్రభావం ఏ మేరకు?
తెలంగాణ ఫలితంతో మాకు సంబంధం లేదు!
తెలంగాణ ఫలితంతో మాకు సంబంధం లేదు!
రేపు 1.30కి సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం...!
రేపు 1.30కి సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం...!
లోక్ సభ వాయిదా..రాఫెల్ పై ప్రతిపక్షాల నిరసన..
లోక్ సభ వాయిదా..రాఫెల్ పై ప్రతిపక్షాల నిరసన..
తెలంగాణలో కెసిఆర్ విజయంఫై పోసాని ప్రెస్ మీట్...!
తెలంగాణలో కెసిఆర్ విజయంఫై పోసాని ప్రెస్ మీట్...!
నేడు తెలంగాణా భవన్ లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం...!
నేడు తెలంగాణా భవన్ లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం...!
ప్రెస్ నోట్స్


రాజకీయ వార్తలు
సినిమా వార్తలు