Advertisement


హొమ్ /రాజకీయ వార్తలు / జనసేన జనతరంగం కార్యక్రమాన్ని ప్రారభించిన పవన్ కళ్యాణ్...!

జనసేన జనతరంగం కార్యక్రమాన్ని ప్రారభించిన పవన్ కళ్యాణ్...!

జనసేన పార్టీని ప్రజలకు చేరువ చేసేందుకు చేపట్టిన జనతరంగం కార్యక్రమాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రారంభించారు. అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న పవన్‌ కల్యాణ్‌ సింగనమల నియోజకవర్గం మార్తాడులో జనసేనజనతరంగం కార్యక్రమాన్ని ప్రారంభించారు. జనసేన జనతరంగం కార్యక్రమం ఏపీ వ్యాప్తంగా జరగనుంది. రాష్ట్ర, దేశ అభివృద్ధితో జసేనను, యువతను భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చెపట్టారు.తుని పట్టణంలో జనసేన పార్టీ నిర్వహించిన జన తరంగం కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు కు అడుగడుగునా ప్రజలు నీరాజనం పట్టారు. జన తరంగం కార్యక్రమంలో భాగంగా భవన నిర్మాణ కార్మికుల తో ఆయన భేటీ అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జనసేన మేనిఫెస్టోను వారికి వివరించారు. అవినీతి లేని స్వచ్ఛమైన పాలన అందించేందుకు వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపించాలని, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జనసేన మేనిఫెస్టో తో కూడిన కరపత్రాలను అశోక్ బాబు విడుదల చేశారు. ఈ కార్యక్రమం లో జనసేన నేతలు పంతం నానాజీ, చోడిశెట్టి గణేష్ , డి. చిరంజీవి రాజు, బోనం చినబాబు, అంకంరెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ప్రచురించబడింది: 05-12-2018 14:23:25




మరిన్నీ రాజకీయ వార్తలు

టీఆర్ఎస్ గూటికి గెలిచినా ఇండిపెండెంట్ అభ్యర్థులు...!
టీఆర్ఎస్ గూటికి గెలిచినా ఇండిపెండెంట్ అభ్యర్థులు...!
అందరికంటే ఘోర పరాభవం చంద్రబాబుకే!
అందరికంటే ఘోర పరాభవం చంద్రబాబుకే!
చంద్రబాబుని  ఓడించడానికి ఉద్యోగులు చాలు
చంద్రబాబుని ఓడించడానికి ఉద్యోగులు చాలు
ఆంధ్రపై ప్రభావం ఏ మేరకు?
ఆంధ్రపై ప్రభావం ఏ మేరకు?
తెలంగాణ ఫలితంతో మాకు సంబంధం లేదు!
తెలంగాణ ఫలితంతో మాకు సంబంధం లేదు!
రేపు 1.30కి సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం...!
రేపు 1.30కి సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం...!
లోక్ సభ వాయిదా..రాఫెల్ పై ప్రతిపక్షాల నిరసన..
లోక్ సభ వాయిదా..రాఫెల్ పై ప్రతిపక్షాల నిరసన..
తెలంగాణలో కెసిఆర్ విజయంఫై పోసాని ప్రెస్ మీట్...!
తెలంగాణలో కెసిఆర్ విజయంఫై పోసాని ప్రెస్ మీట్...!
నేడు తెలంగాణా భవన్ లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం...!
నేడు తెలంగాణా భవన్ లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం...!
ప్రెస్ నోట్స్


రాజకీయ వార్తలు
సినిమా వార్తలు