Advertisement


హొమ్ /రాజకీయ వార్తలు / రేపే తెలంగాణ శాశనసభ ఎన్నికల సమరం...!

రేపే తెలంగాణ శాశనసభ ఎన్నికల సమరం...!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 7న జరుగనుంది. రేపు జరిగే పోలింగ్ కు ఈసీ, పోలీసు శాఖ సంయుక్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ పూర్తి కానుంది. తెలంగాణలోని 119 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈనెల 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,821 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 2 కోట్ల 80 లక్షల 64 వేల 684 మంది ఓటర్లు ఉన్నారు. 32 వేల 815 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈవీఎంలు 55 వేలు, 329, వీవీప్యాట్స్ 42 వేల 751 ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో 2 లక్షల మంది ఉద్యోగులు పాల్గోనున్నారు. అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. కేంద్ర బలగాలతోపాటు ఆరు రాష్ట్రాల నుంచి వచ్చిన పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. రాష్ట్రానికి చెందిన 30 వేల మంది పోలీసు సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. రాష్ట్రంలో 4 వేల సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఒక్కో సీనియర్ అధికారికి ఒక్కో నియోజకవర్గ భాధ్యతలు అప్పగించారు.

ప్రచురించబడింది: 06-12-2018 14:14:34




మరిన్నీ రాజకీయ వార్తలు

టీఆర్ఎస్ గూటికి గెలిచినా ఇండిపెండెంట్ అభ్యర్థులు...!
టీఆర్ఎస్ గూటికి గెలిచినా ఇండిపెండెంట్ అభ్యర్థులు...!
అందరికంటే ఘోర పరాభవం చంద్రబాబుకే!
అందరికంటే ఘోర పరాభవం చంద్రబాబుకే!
చంద్రబాబుని  ఓడించడానికి ఉద్యోగులు చాలు
చంద్రబాబుని ఓడించడానికి ఉద్యోగులు చాలు
ఆంధ్రపై ప్రభావం ఏ మేరకు?
ఆంధ్రపై ప్రభావం ఏ మేరకు?
తెలంగాణ ఫలితంతో మాకు సంబంధం లేదు!
తెలంగాణ ఫలితంతో మాకు సంబంధం లేదు!
రేపు 1.30కి సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం...!
రేపు 1.30కి సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం...!
లోక్ సభ వాయిదా..రాఫెల్ పై ప్రతిపక్షాల నిరసన..
లోక్ సభ వాయిదా..రాఫెల్ పై ప్రతిపక్షాల నిరసన..
తెలంగాణలో కెసిఆర్ విజయంఫై పోసాని ప్రెస్ మీట్...!
తెలంగాణలో కెసిఆర్ విజయంఫై పోసాని ప్రెస్ మీట్...!
నేడు తెలంగాణా భవన్ లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం...!
నేడు తెలంగాణా భవన్ లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం...!
ప్రెస్ నోట్స్


రాజకీయ వార్తలు
సినిమా వార్తలు